Share News

స్వచ్చ అవార్డులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:56 AM

స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

స్వచ్చ అవార్డులు

స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ‘స్వచ్ఛ మునిసిపాలిటీస్‌’, ‘స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం’ కేటగిరీల్లో జీవీఎంసీ, ఆలయాల విభాగంలో సింహాచలం దేవస్థానం, స్వచ్ఛ పాఠశాల విభాగంలో చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల, ఆస్పత్రుల విభాగంలో పెందుర్తి సీహెచ్‌సీ, చినముషిడివాడ యూసీహెచ్‌సీ, స్వచ్ఛ బస్‌స్టేషన్‌ల విభాగంలో ద్వారకా బస్‌స్టేషన్‌, హోటల్స్‌ విభాగంలో నోవాటెల్‌ ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆయా సంస్థల అధికారులకు గాంధీ జయంత్రి సందర్భంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవార్డులు అందజేశారు.

Updated Date - Oct 03 , 2026 | 12:56 AM