ఎలమంచిలికి స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:57 AM
‘స్వచ్ఛ ఆంధ్ర’ పురస్కారానికి ఎలమంచిలి మునిసిపాలిటీ ఎంపికైందని కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. రాష్ట్రంలో 50 వేలలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీల్లో ఎలమంచిలి రెండో స్థానంలో నిలిచిందన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోకున్నట్టు వెల్లడించారు. మునిసిపాలిటీలో ఇంటింటా శత శాతం చెత్త సేకరణ, తడి- పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయడంతోపాటు మరికొన్ని అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపడంతో పురస్కారానికి ఎంపికైనట్టు ఆయన చెప్పారు.
రాష్ట్రస్థాయిలో రెండవస్థానం
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రదానం
ఎలమంచిలి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛ ఆంధ్ర’ పురస్కారానికి ఎలమంచిలి మునిసిపాలిటీ ఎంపికైందని కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. రాష్ట్రంలో 50 వేలలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీల్లో ఎలమంచిలి రెండో స్థానంలో నిలిచిందన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోకున్నట్టు వెల్లడించారు. మునిసిపాలిటీలో ఇంటింటా శత శాతం చెత్త సేకరణ, తడి- పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయడంతోపాటు మరికొన్ని అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపడంతో పురస్కారానికి ఎంపికైనట్టు ఆయన చెప్పారు.
అనకాపల్లి ఆయుర్వేద ఆస్పత్రికి అవార్డు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలకు రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డు లభించింది. విజయవాడలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును వైద్యాధికారిణి డాక్టర్ లావణ్య అందుకోనున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం.. ఆస్పత్రి నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థాల తొలగింపు, రోగులకు సేవలు, మందుల రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై మూడు దశల్లో పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి అవార్డు రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.