Share News

పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:42 AM

ఏ నగరమైనా పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధిని సాధిస్తుందని ఎంపీ శ్రీభరత్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

చట్టాలను నిష్పక్షపాతంగా అమలుచేయాలి

సీఐఐ సదస్సులో ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ఏ నగరమైనా పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధిని సాధిస్తుందని ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో ‘హరితాభివృద్ధి, డిజిటల్‌ పరివర్తన, వాతావరణ మార్పులు’ అనే అంశంపై సీఐఐ శుక్రవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. సుస్థిర జీవన విధానమే భావితరాల భవిష్యత్తుకు నిజమైన పెట్టుబడి అన్నారు. సముద్ర కాలుష్యం నివారణకు కూ.330 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. సీఐఐ విశాఖ అధ్యక్షుడు జి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్యాన్ని 2070 నాటికి నెట్‌ జీరో స్థాయికి తీసుకువచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. సీఐఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.సాంబశివరావు మాట్లాడుతూ, సముద్ర రవాణా రంగంలో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందన్నారు. పొడవైన తీర ప్రాంతం, పోర్టుల మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు దీనికి దోహదపడతాయన్నారు. ఇంకా ఈ సమావేశంలో గ్రీన్‌ కో గ్రూపు డైరెక్టర్‌ అండ్‌ సీఎస్‌ఓ డాక్టర్‌ పరవస్తు రాంబాబు తదితరులు ప్రసంగించారు. సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:42 AM