Share News

రథ సప్తమికి సూర్యనారాయణుడి ఆలయం ముస్తాబు

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:57 AM

స్థానిక మెయిన్‌రోడ్డులోని సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద గల సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం జరిగే రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. వేకువజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

రథ సప్తమికి సూర్యనారాయణుడి ఆలయం ముస్తాబు
ఆలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు

భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాటు

అనకాపల్లి టౌన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : స్థానిక మెయిన్‌రోడ్డులోని సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద గల సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం జరిగే రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. వేకువజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్‌ బొడ్డేడ మురళి, ఈవో మురళీకృష్ణ, ధర్మకర్తలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు సిద్ధం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:57 AM