Share News

అన్నదాతకు ఆసరా

ABN , Publish Date - May 06 , 2026 | 12:50 AM

వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు యాంత్రీకరణలో భాగంగా మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌(ఎస్‌ఎంఏఎం)పథకం ద్వారా రాయితీపై వ్యవసాయానికి ఉపయోగపడే యంత్ర పరికరాలను అందించనుంది. అందుకు గాను జిల్లాకు రూ.2 కోట్ల 87 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలో వ్యవసాయ యంత్రాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవసరమైనవి కొనుగోలు చేసి అందిస్తారు.

అన్నదాతకు ఆసరా
వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు(ఫైల్‌)

- చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం భరోసా

- యాంత్రీకరణ ప్రోత్సాహానికి జిల్లాకు రూ.2.87 కోట్లు మంజూరు

- ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు యాంత్రీకరణలో భాగంగా మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌(ఎస్‌ఎంఏఎం)పథకం ద్వారా రాయితీపై వ్యవసాయానికి ఉపయోగపడే యంత్ర పరికరాలను అందించనుంది. అందుకు గాను జిల్లాకు రూ.2 కోట్ల 87 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలో వ్యవసాయ యంత్రాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవసరమైనవి కొనుగోలు చేసి అందిస్తారు.

లబ్ధిదారుల అర్హత ప్రమాణాలివీ...

సొంత భూమి కలిగిన రైతులు, అటవీ హక్కు పత్రాలున్న రైతులు వ్యవసాయ యంత్రాలు పొందేందుకు అర్హులు. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రాయితీలు పొందిన రైతులు అనర్హులు. అలాగే గత మూడు సంవత్సరాలుగా ఈ-క్రాప్‌ నమోదు చేయించుకుని ఉండడంతో పాటు కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే రాయితీ యంత్ర పరికరాలు అందిస్తారు. ఎస్‌టీ, ఎస్‌సీ రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం మాత్రమే రాయితీ కల్పిస్తారు. తొమ్మిది రకాలైన ట్రాక్టర్‌ పనిముట్లు, విత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, స్ర్పేయర్లు, స్వీయ చోదక ఇంప్లిమెంట్స్‌, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, నూర్పిడి యంత్రాలు, పంట విలువ జోడించే యంత్రాలు, ఎండుగడ్డి, మేత సామగ్రిని అందిస్తారు. అలాగే యంత్రాల కోసం జ్ట్టిఞట//్ఛట్ఛ్ఛఛీ.్చఞ.జౌఠి.జీుఽ/ఊక/ అనే వెబ్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఈ నెల 19వ తేదీలోగా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులకు అలవాటు పడుతున్న గిరిజన రైతులకు రాయితీపై యంత్రాలు అందించే పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

ఈ పథకంలో యంత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతుల జాబితాలను ఖరారు చేసి, పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రూపొందించిన జాబితాలను తొలుత జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతారు.

Updated Date - May 06 , 2026 | 12:50 AM