ఎండ.. వాన
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:29 AM
జిల్లా శనివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో చింతచెట్టు నేలకొరిగింది. నాతవరం మండలం ఏపీపురంలో విద్యుత్ స్తంభం విరిగిపడిపోయింది. అనకాపల్లి, కశింకోట, గొలుగొండ, కృష్ణాదేవిపేట, మాకవరపాలెం, చీడికాడ, బుచ్చెయ్యపేట, ఎస్.రాయవరం, ఎలమంచిలి మండలాల్లో సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. అచ్యుతాపురం, సబ్బవరం, పరవాడ మండలాల్లో సాయంత్రం చల్లని వాతావరణం నెలకొనడంతో జనం కాస్త ఉపశమనం పొందారు.
- జిల్లాలో భిన్న వాతావరణం
- రోలుగుంట, నాతవరం మండలాల్లో ఈదురు గాలుల బీభత్సం
అనకాపల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా శనివారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో చింతచెట్టు నేలకొరిగింది. నాతవరం మండలం ఏపీపురంలో విద్యుత్ స్తంభం విరిగిపడిపోయింది. అనకాపల్లి, కశింకోట, గొలుగొండ, కృష్ణాదేవిపేట, మాకవరపాలెం, చీడికాడ, బుచ్చెయ్యపేట, ఎస్.రాయవరం, ఎలమంచిలి మండలాల్లో సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. అచ్యుతాపురం, సబ్బవరం, పరవాడ మండలాల్లో సాయంత్రం చల్లని వాతావరణం నెలకొనడంతో జనం కాస్త ఉపశమనం పొందారు.
రావికమతంలో..
రావికమతం: మండలంలో ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం జన సంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అయితే కల్యాణపులోవ, కొత్తకోట నుంచి పొన్నవోలు వరకు సాయంత్రం వర్షం కురిసింది.
చోడవరంలో..
చోడవరం: మండలంలో శనివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ ఎండ ఠారెత్తించగా, సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో స్థానికులు ఊరట చెందారు. గత మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, శనివారం కూడా ఎండ అదే స్థాయిలో ఉంది. అయితే వాతావరణంలో మార్పుల ప్రభావంతో సాయంత్రం 3 గంటల సమయంలో కురిసిన ఓ మోస్తరు వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
రోలుగుంటలో..
రోలుగుంట: మండలంలో శనివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని జగ్గంపేట, జె.నాయుడుపాలెం, కొమరవోలు, రోలుగుంట, జానకిరాంపురం, తదితర గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. జె.నాయుడుపాలెంలో భారీ చింతచెట్టు నేలకొరిగి విద్యుత్ స్తంభం, కిందన ఉన్న వాహనాలపై పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మాడుగులలో..
మాడుగుల రూరల్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం మోస్తరు వర్షం పడింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు.
దేవరాపల్లిలో..
దేవరాపల్లి: మండలంలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించడంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే సాయంత్రం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
నాతవరంలో..
నాతవరం: మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఏపీపురంలో రెండు, లింగంపేటలో రెండు, నాతవరంలో ఒక్కటి చొప్పున విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యుత్ శాఖాధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేసి సరఫరాకు పునరుద్ధరించారు.
పాయకరావుపేటలో..
పాయకరావుపేట: పట్టణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ అధికంగా ఉండడంతో రమదారులు నిర్మానుష్యంగా మారాయి. అయితే సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో జనం ఉపశమనం పొందారు.
ఎస్.రాయవరంలో..
ఎస్.రాయవరం: మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎండ అధికంగా ఉండగా, సాయంత్రం వర్షం కురిసింది.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం అర్బన్: మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మండలంలోని చెట్టుపల్లి, గబ్బాడ, ధర్మసాగరం, నగరం, దుగ్గాడ, నీలంపేట గ్రామాల్లో వర్షం పడింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.