Share News

మన్యంలో ఎండ ప్రభావం

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:56 PM

మన్యంలో ఎండలు ప్రభావం చూపుతున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఎండ ప్రభావం మొదలు కావడంతో పాటు మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రంగా కాస్తున్నది.

మన్యంలో ఎండ ప్రభావం
గురువారం మధ్యాహ్నం ఎండకు నిర్మానుష్యంగా ఉన్న పాడేరు- జి.మాడుగుల మార్గం

కొయ్యూరులో అత్యధికంగా 36.3 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు ప్రభావం చూపుతున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఎండ ప్రభావం మొదలు కావడంతో పాటు మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రంగా కాస్తున్నది. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. గురువారం కొయ్యూరులో 36.3, అరకులోయలో 35.1, జి.మాడుగులలో 34.2, అనంతగిరిలో 33.1, చింతపల్లి, హుకుంపేటలోలో 31.7, పెదబయలులో 31.2, ముంచంగిపుట్టులో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 09 , 2026 | 11:56 PM