సన్ డే
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:54 AM
జిల్లాలో ఆదివారం సైతం ఎండ తీవ్ర, వడగాడ్పులు కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీక్షణంగా కాసింది. దీంతో మధ్యాహ్న సమయంలో నిప్పుల కొలిమిలా మారింది.
ఠారెత్తించిన భానుడు
ఎండ తీవ్రతకుతోడు, వడగాడ్పులు
దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో 42.1 డిగ్రీలు
అనకాపల్లి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం సైతం ఎండ తీవ్ర, వడగాడ్పులు కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీక్షణంగా కాసింది. దీంతో మధ్యాహ్న సమయంలో నిప్పుల కొలిమిలా మారింది. రాంబిల్లి మినహా మిగిలిన మండలాల్లో 38 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు రహదారులపై జన సంచారం తగ్గిపోయింది. కాగా ఆదివారం దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో 42.1 డిగ్రీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. నాతవరంలో 41.5, నర్సీపట్నంలో 41.3, మాకవరపాలెంలో 41.2, గొలుగొండలో 40.9, చోడవరంలో 40.8, పరవాడలో 40.4, సబ్బవరంలో 40.4, కశింకోటలో 40.4, మునగపాకలో 40.4, కె.కోటపాడులో 40, రావికమతంలో 39.9, రోలుగుంటలో 39.9, బుచ్చెయ్యపేటలో 39.8, అచ్యుతాపురంలో 39.8, పాయకరావుపేటలో 39.5, అనకాపల్లిలో 39.4, మాడుగులలో 39.3, నక్కపల్లిలో 39.1, ఎస్.రాయవరంలో 38.7, ఎలమంచిలిలో 38.6, కోటవురట్లలో 38, రాంబిల్లిలో 36.3 డిగ్రీలు నమోదయ్యాయి.