Share News

సన్‌‘డే’!

ABN , Publish Date - May 25 , 2026 | 12:27 AM

భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోయారు.

సన్‌‘డే’!

భగ్గుమన్న భానుడు

ఉదయం నుంచీ అల్లాడిన నగరవాసులు

సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత

ఉక్కపోతతో విలవిల్లాడిన ప్రజలు

సేద తీరేందుకు తీరానికి భారీగా చేరిన జనం

విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):

భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోయారు. ఆదివారం ఉదయం నుంచే ఎండతీవ్రత నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ ప్రచండంతో బయటకు వచ్చేందుకు భయపడ్డారు. దీంతో ఉదయం 10 గంటలకే నగరంలోని అనేక రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. మధ్యాహ్నం అనేక ప్రాంతాల్లో వడగాలులు వీయడంతో వాహనదా రులు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు, ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. ఎండ వేడిమి తోపాటు ఉక్కపోతతో ఇళ్లల్లో ఉన్న వాఉ చెమటలు కక్కారు. వేడిని తట్టుకోలేక ఏసీ గదులకే పరిమితమ య్యారు.

ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీగా ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. విశాఖ రూరల్‌, మహారాణిపేటలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు నగర పరిధిలోని అనేక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆర్‌కే బీచ్‌కు తరలివచ్చారు. సముద్రంలో స్నానాలు చేస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు.

Updated Date - May 25 , 2026 | 12:27 AM