Share News

ఎండ... వాన!

ABN , Publish Date - May 27 , 2026 | 12:11 AM

జిల్లాలో మంగళవారం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపగా, ఆ తరువాత వరుణుడు కరుణించాడు. పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసి .వాతావరణం చల్లబడింది. కాగా వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం నర్సీపట్నంలో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదు రోజులతోపోలిస్తే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే వడగాడ్పులు మాత్రం యథావిధిగా కొనసాగాయి.

ఎండ... వాన!
ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా ఉన్న అనకాపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు

జిల్లాలో భిన్న వాతావరణం

నర్సీపట్నంలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

గుల్లేపల్లిలో వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

అనకాపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపగా, ఆ తరువాత వరుణుడు కరుణించాడు. పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసి .వాతావరణం చల్లబడింది. కాగా వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం నర్సీపట్నంలో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఐదు రోజులతోపోలిస్తే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే వడగాడ్పులు మాత్రం యథావిధిగా కొనసాగాయి. మిగిలిన మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. అనకాపల్లిలో 38.7, అచ్యుతాపురంలో 35.6, బుచ్చెయ్యపేటలో 38.5, చీడికాడలో 37.9, చోడవరంలో 39.2, దేవరాపల్లిలో 39.8, గొలుగొండలో 40.1, కె.కోటపాడులో 39.6, కశింకోటలో 39, కోటవురట్లలో 38.5, మాడుగులలో 38.9, మాకవరపాలెంలో 40.4, మునగపాకలో 38.5, నక్కపల్లిలో 36.4, నాతవరంలో 40.5, పరవాడలో 38.2, పాయకరావుపేటలో 37.8, రాంబిల్లిలో 36.8, రావికమతంలో 38.5, రోలుగుంటలో 38.3, ఎస్‌.రాయవరంలో 37.9, సబ్బవరంలో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి.

ఫొటోరైటప్‌:

వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

కె.కోటపాడు, మే 26 (ఆంధ్రజ్యోతి): వడదెబ్బ ప్రభావంతో మండలంలోని గుల్లేపల్లిలో ఉపాధి హామీ పథకం కూలీ ఒకరు మృతిచెందాడు. గ్రామానికి చెందిన డొప్ప శ్రీరామ్మూర్తి (46) మంగళవారం ఉదయం సహచర కూలీలతో కలిసి నల్లగొండ ఏరియాలో కందకాలు తవ్వే పనికి వెళ్లారు. సుమారు తొమ్మిది గంటల సమయంలో ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు. సహచర కూలీలు 108కు ఫోన్‌ చేయడంతో కొద్దిసేపటికి అంబులెన్స్‌ వచ్చింది. చికిత్స నిమిత్తం కె.కోటపాడు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని డ్వామా ఉన్నతాధికారులకు తెలియపరిచినట్టు వీఆర్పీ అక్కునాయుడు తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 12:11 AM