Share News

చిన్నారులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:52 AM

జిల్లాలోని 50 కేంద్రాల్లో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌ఏఓ) పూజారి శైలజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఎనిమిది నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని ఆయా క్రీడల్లో తర్ఫీదు పొందడంతోపాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో క్రీడాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించడానికి వీలుంటుందని పేర్కొన్నారు.

చిన్నారులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
పూజారి శైలజ, డీఎస్‌ఏఓ

మే నెలలో 50 కేంద్రాల్లో నిర్వహణ

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శైలజ

అనకాపల్లి టౌన్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 50 కేంద్రాల్లో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌ఏఓ) పూజారి శైలజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఎనిమిది నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని ఆయా క్రీడల్లో తర్ఫీదు పొందడంతోపాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో క్రీడాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. కాగా ఆయా క్రీడా శిక్షణ కేంద్రాల నిర్వహణకు ఆసక్తిగల క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులు ఈ నెల 30వ తేదీలోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కోసం 98855 30819, 9332777778 నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని సూచించారు.

Updated Date - Mar 26 , 2026 | 12:52 AM