Share News

వేసవి క్రీడా శిబిరాలకు ఆదరణ

ABN , Publish Date - May 08 , 2026 | 01:44 AM

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, ఉషూ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త ఆధ్వర్యంలో చోడవరం పంచాయతీ శివారు అన్నవరంలోని గణేశ్‌ డిఫెన్స్‌ అకాడమీలో పాఠశాలల విద్యార్థులకు ఆత్మరక్షణ విద్య (మార్షల్‌ ఆర్ట్స్‌) ఉషూలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

వేసవి క్రీడా శిబిరాలకు ఆదరణ

మార్షల్‌ ఆర్ట్స్‌లో విద్యార్థులకు శిక్షణ

దాతల సాయంతో పౌష్టికాహారం పంపిణీ

చోడవరం, మే 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, ఉషూ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త ఆధ్వర్యంలో చోడవరం పంచాయతీ శివారు అన్నవరంలోని గణేశ్‌ డిఫెన్స్‌ అకాడమీలో పాఠశాలల విద్యార్థులకు ఆత్మరక్షణ విద్య (మార్షల్‌ ఆర్ట్స్‌) ఉషూలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉషూ మార్షల్‌ ఆర్ట్స్‌లో స్పోర్ట్స్‌ ఆఽథారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌ అయిన పుల్లేటి గణేశ్‌ శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 ప్రదేశాల్లో యోగా, కరాటే, తైక్వాండోతోపాటు పలు క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడంతో పాటు వారికి శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడాలన్న ఉద్దేశంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు. అన్నవరంలో నిర్వహిస్తున్న శిబిరంలో సుమారు 50 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. దాతల సహకారంతో వీరికి వేయించిన వేరుశనగ గుళ్లు, బెల్ల్లంతో చేసిన చిక్కీలు, రాగిపిండితో చేసిన వంటకాలు, అరటిపండ్లు, ఉడకబెట్టిన కోడి గుడ్లు, తదితర పోషకాహారాలను అందిస్తున్నారు.

శారీరక దృఢత్వం పెరుగుతుంది

పుల్లేటి గణేశ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోచ్‌

ఉషూ మార్షల్‌ ఆర్ట్స్‌లో చిన్నతనం నుంచి తర్ఫీదు పొందడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. చదువు విషయంలో మానసిక ఒత్తిడిని దూరంఏకాగ్రత పెంచుతుంది. దీంతో ఆరోగ్యంగా, చురుగ్గా వుండడంతోపాటు చదువులో సైతం రాణించే అవకాశం వుంది. శిక్షణతోపాటు జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే అనర్థాలను, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే మేలు గురించి వివరిస్తున్నాం.

Updated Date - May 08 , 2026 | 01:44 AM