పోలీస్ సిబ్బందికి సమ్మర్ కిట్లు పంపిణీ
ABN , Publish Date - May 29 , 2026 | 10:40 PM
వేసవి వేడిమి నుంచి రక్షణకు జిల్లాలోని పోలీసు సిబ్బందికి సమ్మర్ కిట్లను ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం పంపిణీ చేశారు.
పాడేరురూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): వేసవి వేడిమి నుంచి రక్షణకు జిల్లాలోని పోలీసు సిబ్బందికి సమ్మర్ కిట్లను ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కిట్టులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, హాట్, కూలింగ్ గ్లాసులు, హ్యాండ్ గ్లవ్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల్లో విధులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎక్కువసేపు ఎండలో నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఎక్కుగా నీటిని సేవించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బి.అప్పలనాయుడు, డీసీఆర్‌బీ సీఐ జి.సంజీవరావు, పాడేరు స్టేషన్ సీఐ డి.దీనబందు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.