అందరి సహకారంతో విజయవంతం
ABN , Publish Date - May 17 , 2026 | 10:24 PM
అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు (గిరిజన ఉత్సవం) విజయవంతమవుతున్నాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
గిరిజన ఉత్సవంలో కలెక్టర్ నిషాంతి
పాడేరు, మే 17(ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు (గిరిజన ఉత్సవం) విజయవంతమవుతున్నాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. గిరిజన ఉత్సవం పేరిట ఆదివారం రాత్రి స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ఢంకా వాయించి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతానికి అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నారన్నారు. ఉత్సవాలకు విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రభుత్వ పరంగా ఉత్సవాల నిర్వహణకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సహకరించారని కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత చైర్మన్ వంపూరు గంగులయ్య, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణారావు, తదితరులు మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి గిరిజన కళాకారులు, విద్యార్థులు వేదికపై తమ ప్రదర్శనలిచ్చారు. ఈకార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిసే్ట్రటర్ వి.అభిషేక్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏవో ఎం.హేమలత, టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ ఎల్.భాస్కరరావు, సమగ్ర శిక్షణ ఏపీసీ స్వామినాయుడు, స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బి.కల్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.