Share News

మత్స్యకారులకు భృతి

ABN , Publish Date - May 20 , 2026 | 12:21 AM

చేపల వేట నిషేధకాలంలో భృతి కింద జిల్లాలో 13,597 మంది మత్స్యకారుల ఖాతాలకు రూ.27.19 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు.

మత్స్యకారులకు భృతి

జిల్లాలో 13,597 మందికిరూ.27.19 కోట్లు జమ

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

చేపల వేట నిషేధకాలంలో భృతి కింద జిల్లాలో 13,597 మంది మత్స్యకారుల ఖాతాలకు రూ.27.19 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొనగా, కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, సీహెచ్‌ వంశీకృష్ణశ్రీనివాస్‌, జేసీ జి.విద్యాధరి, ఇతర అధికారులతో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 13,597 మంది మత్స్యకారులకు జమ చేసిన రూ.27.19 కోట్లకు సంబంధించి చెక్కును అందజేశారు. అనంతరం కలెక్టర్‌ అభిషిక్త్‌ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూ. 20 వేలు వంతున విడుదల చేసిందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 1,500 మందికి అదనంగా లబ్ధి చేకూరినట్టు తెలిపారు. గతంలో మెకనైజ్డ్‌ బోట్లలో పనిచేసే ఆరుగురికి మాత్రమే జీవన భృతి వచ్చేదని, ప్రస్తుతం ఎనిమిది మంది నుంచి పది మందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా గుర్తించి పథకంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావు, ఏపీ బోటు ఆపరేటర్ల సంఘం నాయకులు, మత్స్యకార నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, పీసీ అప్పారావు, మున్నం బాలాజీ, నరసింగరావు, కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.


నేడు మెడికల్‌ షాపులు బంద్‌

ముందస్తు చర్యలు తీసుకున్నాం

జిల్లా ఔషధ నియంత్రణ

విభాగ సహాయ సంచాలకులు కె.రజిత

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ పిలుపు మేరకు బుధవారం మెడికల్‌ షాపుల నిర్వాహకులు బంద్‌ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఔషధ నియంత్రణ విభాగ సహాయ సంచాలకులు కె.రజిత తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బంద్‌ వల్ల ప్రజలకు, రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ప్రధాన కేంద్రంలో ఒక మెడికల్‌ షాపు తప్పనిసరిగా తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే అన్ని ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌ల్లో ఉండే మెడికల్‌ షాపులు యథావిధిగా పనిచేస్తాయని, కాబట్టి, అత్యవసర మందులు కొరత తలెత్తే అవకాశం లేదన్నారు. అలాగే కార్పొరేట్‌ ఫార్మసీ సంస్థ అయిన ‘మెడ్‌ ప్లస్‌’ యాజమాన్యం తాము ఈ బంద్‌లో పాల్గొనడం లేదని ప్రకటించిందన్నారు. మరో ప్రముఖ సంస్థ అపోలో ఫార్మసీ కూడా జిల్లాలో 50 శాతం షాపులను తెరిచే ఉంచుతామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. మందులు కొనుగోలులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మహారాణిపేట, గోపాలపట్నం మండలాలకు చెందినవారు విశాఖపట్నం (సేల్స్‌) డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసరావు (8884394949)కు, విశాఖపట్నం రూరల్‌, సీతమ్మధార, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలకు చెందినవారు విశాఖపట్నం (మానుఫ్యాక్చరింగ్‌) డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. అభిప్రియ (

ఇబ్బందులుంటే 7382934332 నంబర్‌కు సంప్రదించాలన్నారు. అలాగే, విశాఖపట్నం (విజిలెన్స్‌) డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.కళ్యాణికి పెందుర్తి, గాజువాక, ములగాడ, పెదగంట్యాడ మండల పరిధిలో ఇబ్బందులు ఉంటే 7382934375 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.


22 నుంచి విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రవేశపెడుతున్నామని సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. ఈ సర్వీస్‌లు రానుపోను 12 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు (08581) ఈ నెల 22 నుంచి జూన్‌ 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. బెంగళూరు-విశాఖ ప్రత్యేక రైలు (08582) ఈ నెల 23 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - May 20 , 2026 | 12:21 AM