విద్యార్థులు ఇంటి బాట
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:23 PM
విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు.
నేటి నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు
విద్యార్థులు, తల్లిదండ్రులతో పాడేరు బస్ కాంప్లెక్సు కిటకిట
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళుతున్న దృశ్యాలు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం దర్శనమిచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో స్థానిక ఆర్‌టీసీ బస్ కాంప్లెక్స్ కిటకిటలాడింది. పాడేరులో శుక్రవారం వారపు సంతతో ఉండడంతో విద్యార్థులు ఇళ్లకు వెళుతుండడంతో సందడి వాతావరణం నెలకొంది.
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు : డీఈవో
దసరా సెలవుల్లో ప్రైవేటు విద్యాలయాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు విద్యాలయాలు సైతం దసరా సెలవులను పాటించాలని ఈనెల 22న విఽధిగా పాఠశాలల పునఃప్రారంభించాలని డీఈవో సూచించారు. నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.