వానొస్తే విద్యార్థులకు కష్టాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:27 AM
మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కిండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు రేకులు దెబ్బతినడంతో వర్షపు నీరు కారిపోయి తరగతి తడిచి ముద్దవుతోంది.
కిండలం పాఠశాల భవనం పైకప్పు రేకులు దెబ్బతిని కారిపోతున్న వైనం
తరగతి గదిలో కూర్చోలేని పరిస్థితి
చందాలు వేసుకుని టార్పాలిన్ ఏర్పాటు చేసిన గ్రామస్థులు
పెదబయలు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కిండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు రేకులు దెబ్బతినడంతో వర్షపు నీరు కారిపోయి తరగతి తడిచి ముద్దవుతోంది. విద్యార్థులు కూర్చోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. దీంతో సుమారు 36 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వర్షం కురిసి తరగతి గదిలోని నీరు రావడంతో గ్రామస్థులు చందాలు వేసుకుని టార్పాలిన్ కొనుగోలు చేసి పైకప్పు రేకులపై కప్పారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.