Share News

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:11 AM

పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును రక్షించుకోవాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు బుధవారం బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం

సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌

విశాఖ అఖిల భారత మహాసభలు ప్రారంభం

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని,

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానం

బీచ్‌రోడ్డు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పోరాటాలతోనే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును రక్షించుకోవాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు బుధవారం బీచ్‌రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం తపన్‌సేన్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పాటైన స్టీల్‌ప్లాంటును బలహీనపరిచే కుట్రలను ఈ తీర్మానం ఎండగట్టిందన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాలన్నారు. అఖిల భారత సీఐటీయూ అధ్యక్షురాలు డాక్టర్‌ కె.హేమలత మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌లు రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శక్తివంతమైన సమరశీల ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. డబ్ల్యుఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పాంబిస్‌ కిర్స్టస్‌ మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మిక కోడ్‌లను బలవంతంగా అమలు చేయడానికి యత్నిస్తే ప్రతిఘటన తప్పదన్నారు. కార్మిక కోడ్‌లను రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, హెచ్‌ఎంఎస్‌ ఆఫీస్‌ బేరర్‌ సభ్యుడు సుదర్శనరావు, ఏఐటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ క్లిఫ్టన్‌, ఎస్‌ఇడబ్ల్యుఏ ఉపాధ్యక్షులు సోనియా జార్జ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 01:11 AM