Share News

అక్రమ కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:21 PM

జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా అక్రమ కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా కొనసాగిస్తున్నామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ గురువారం విలేకరులకు తెలిపారు.

అక్రమ కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా
పాడేరు- అరకులోయ హైవేలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ వెల్లడి

పాడేరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా అక్రమ కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా కొనసాగిస్తున్నామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ గురువారం విలేకరులకు తెలిపారు. నిఘాలో భాగంగా మండల కేంద్రాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద వాహనాలు, వ్యక్తుల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. గంజాయి రవాణా, ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసు సిబ్బంది నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. అలాగే ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని ఎస్‌పీ వివరించారు. అన్ని కోణాల్లో అవసరమైన చర్యలు చేపట్టి జిల్లాను నేరరహితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అందుకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Feb 12 , 2026 | 11:21 PM