గిరిజన రైతుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:58 AM
వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గిరిజన రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రైతుల పీజీఆర్‌ఎస్‌లో ఆమె మాట్లాడారు.
రైతుల పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా గిరిజన రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రైతుల పీజీఆర్‌ఎస్‌లో ఆమె మాట్లాడారు. సాధారణ, ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అయినప్పటికీ రైతుల కోసం ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించి వారి సంక్షేమానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులకు సంబంధించి భూమి, అటవీ హక్కులు, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, చిన్ననీటి పారుదల, తదితర అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన రైతులు తమ సమస్యలపై 22 వినతులను కలెక్టర్ నిషాంతికి సమర్పించారు. అందులో అధికంగా 14 వినతులు అటవీ భూ హక్కుల కల్పనకు సంబంధించినవికాగా, మిగిలినవి కాఫీ తోటలు, భూ పట్టాలకు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, జిల్లా ప్రకృతి సేధ్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, మండల స్థాయి వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.