Share News

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:18 AM

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. మైనర్లు సరదా కోసం ద్విచక్ర లేదా ఇతర వాహనాలు నడిపితే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దని ఎస్పీ సూచించారు.

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు
ఎస్పీ తుహిన్‌సిన్హా

భారీ జరిమానాతోపాటు జైలు శిక్షకు అవకాశం

ఎస్పీ తుహిన్‌సిన్హా

అనకాపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. మైనర్లు సరదా కోసం ద్విచక్ర లేదా ఇతర వాహనాలు నడిపితే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దని ఎస్పీ సూచించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎట్టిపరిస్థితుల్లో రాంగ్‌రూట్‌లో ప్రయాణించవద్దని, మితిమీరిన వేగంతో వాహనాలను నడపవద్దని ఆయన స్పష్టం చేశారు. సొంత వాహనాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందుగా టైర్లు, బ్రేకులు, ఇంజన్‌ కండిషన్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు పగటిపూట ప్రయాణంచేసి, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 01:18 AM