వీధి కుక్కల స్వైర విహారం
ABN , Publish Date - May 02 , 2026 | 11:12 PM
పట్టణ శివారు గాంధీగ్రామం పంచాయతీలో వీధి కుక్కలు స్వైర విహారం చే స్తున్నాయి.
గాంధీగ్రామంలో యథేచ్ఛగా సంచారం
మూడు రోజుల వ్యవధిలో 26 మందిని కరిచిన కుక్కలు
చోడవరం, మే 2 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు గాంధీగ్రామం పంచాయతీలో వీధి కుక్కలు స్వైర విహారం చే స్తున్నాయి. గత నెల 30నుంచి శనివారం వరకు మూడు రోజుల వ్యవధిలో 26 మందిని వీధి కుక్కలు కరిచాయని స్థానికులు తెలిపారు. వీధి కుక్కలు వృద్ధులు, చిన్నారులను కరిచి గాయపరుస్తున్నట్టు గాంధీగ్రామానికి చెందిన బీజేపీ కిసాన్‌మోర్చా నాయకుడు దూది కాంతికుమార్ తెలిపారు. పంచాయతీలో వీధి కుక్కలను నియంత్రించకపోవడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. అధికారులు స్పందించి పంచాయతీలో వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.