Share News

వీధి కుక్కలకు వింత వ్యాధి

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:48 AM

వీధి కుక్కలు వింత వ్యాధిబారిన పడ్డాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శునకాలు కనినిపిస్తున్నాయి. వెంట్రుకలు మొత్తం ఊడిపోయి, శరీరం కమిలిపోయి పుండ్లు పడ్డాయి. వ్యాధి తీవ్రత అధికంగా వున్న కుక్కలు తీవ్రంగా నీరసించి, ఆహారం తినలేక కదల్లేని స్థితిలో వున్నాయి. ఈ తరహా కుక్కలు కొద్ది రోజులకే మృత్యువాత పడుతున్నాయి. వీటి పరిస్థితిని చూసి పలువురు ఆవేదన చెందుతున్నారు.

వీధి కుక్కలకు వింత వ్యాధి
చోడవరంలో చర్మ సంబంధిత వ్యాధిబారిన పడిన వీధి కుక్కలు

తొలిదశలో ఊడిపోతున్న వెంట్రుకలు

కొద్ది రోజులకే చర్మం కమిలిపోయి పండ్లు

ఆహారం సైతం తినలేక బక్కచిక్కిపోతున్న శునకాలు

శరీరం శుష్కించి మృత్యువాత

కుక్కుల దుస్థితిని చూసి జంతు ప్రేమికుల ఆవేదన

చోడవరం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కలు వింత వ్యాధిబారిన పడ్డాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శునకాలు కనినిపిస్తున్నాయి. వెంట్రుకలు మొత్తం ఊడిపోయి, శరీరం కమిలిపోయి పుండ్లు పడ్డాయి. వ్యాధి తీవ్రత అధికంగా వున్న కుక్కలు తీవ్రంగా నీరసించి, ఆహారం తినలేక కదల్లేని స్థితిలో వున్నాయి. ఈ తరహా కుక్కలు కొద్ది రోజులకే మృత్యువాత పడుతున్నాయి. వీటి పరిస్థితిని చూసి పలువురు ఆవేదన చెందుతున్నారు.

వీధి కుక్కల్లో సాధారణంగా మాంజ్‌, సార్కోపిక్‌ మాంజ్‌, డెమాడిక్ట్‌ మాంజ్‌ రకం వ్యాధులబారిన పడతాయుని పశువైద్యనిపుణులు చెబుతున్నారు. సార్కోపిక్‌ మాంజ్‌ సూక్ష్మమైన క్రిముల వల్ల వీధి కుక్కలకు సోకుతుందని, ఇది ఒక కుక్క నుంచి మరో కుక్కకు వేగంగా సంక్రమిస్తున్నదని, దీనిబారిన పడిన కుక్కలకు విపరీతంగా దురదపుట్టి, చర్మం ఎర్రబడిపోతుందని అన్నారు. వీధి కుక్కలకు సరైన ఆహారం లభ్యం కాని పరిస్థితుల్లో డెమోడిక్ట్‌ మాంజ్‌ అనే చర్మ సంబంధిత వ్యాధి సోకుతుంది. గోమారులు, చిలకలు అని పిలిచే పరాన్నజీవులు వీధి కుక్కల రక్తాన్ని తాగడం వల్ల టిక్‌ ఫీవర్‌ వంటి ప్రాణాంతక జ్వరాల బారిన పడుతుంటాయి. వీటితో పాటు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా వీధి కుక్కలు చర్మ సంబంధిత వ్యాధిబారిన పడతాయని చెబుతున్నారు.

మనుషులకు సోకే ప్రమాదం

చర్మ వ్యాధులబారిన పడిన కుక్కలు సంచరించే ప్రదేశాల్లో మనుషులు కూడా కొంతమేర వీటిబారిన పడే అవకాశం వుందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీధి కుక్కలకు సోకిన చర్మవ్యాధుల నియంత్రణకు వ్యాక్సిన్లు వేయడంతోపాటు, వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయాలని సూచిస్తున్నారు.

ఆదేశాలకే పరిమితమైన సంరక్షణ కేంద్రాలు

వీధి కుక్కల సంతతి నియంత్రణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, వీధుల్లో సంచరిస్తున్న కుక్కలను పట్టుకొని వీటికి తరలించాలని స్పష్టం చేసింది. అనంతరం సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేసి, కొద్ది రోజులపాటు కేంద్రంలోనే వుంచాలి. తరువాత వాటిని తిరిగి ఆయా వీధుల్లోనే విడిచిపెట్టాలి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. వీధి కుక్కల నియంత్రణ, సంరక్షణ చర్యలుచేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంతవరకు ఎక్కడా కేంద్రాలను తెరవలేదు. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయలేదు.

Updated Date - Apr 06 , 2026 | 12:48 AM