గ్యాస్‌తో పనిలేని పొయ్యిలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:08 PM
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సిలెండర్లు దొరకడం కష్టంగా మారింది. ఒక్క సిలెండర్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురుదైంది. దుకాణాలకు వాణిజ్య సిలెండర్లు దొరకడం లేదు. దీంతో వినూత్న ఆలోచనతో గ్యాస్‌తో పనిలేని పొయ్యిలను రూపొందించి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
వినూత్న ఆలోచనకు పదును పెడుతున్న నిర్మాణదారులు
చింతపల్లి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సిలెండర్లు దొరకడం కష్టంగా మారింది. ఒక్క సిలెండర్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురుదైంది. దుకాణాలకు వాణిజ్య సిలెండర్లు దొరకడం లేదు. దీంతో వినూత్న ఆలోచనతో గ్యాస్‌తో పనిలేని పొయ్యిలను రూపొందించి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పొయ్యిలను హోటళ్లు, విందు, వినోద కార్యక్రమాల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా డీజిల్, విద్యుత్ సహాయంతో వినియోగించే పొయ్యిలను రూపొందిస్తున్నారు. బ్లోయర్ కనెక్షన్‌తో డీజిల్ ఇంధనంగా వినియోగిస్తూ పనిచేసే పొయ్యిలను విరివిగా విక్రయిస్తున్నారు. ఈపొయ్యిలు రూ.1500 నుంచి రూ.ఐదు వేల వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ గ్యాస్‌తో పనిలేని పొయ్యిలను హోటళ్ల నిర్వాహకులు గ్యాస్‌కి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు.