అనంతగిరిలో ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - May 27 , 2026 | 12:04 AM
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలలు బీభత్సం సృష్టించాయి. పినకోట పంచాయతీ రాచకీలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. వర్షానికి పాఠశాల లోపల సామగ్రి తడిసిపోయింది. అలాగే భీసుపురం, అనంతగిరి, డముకు, తదితర గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
- ఎగిరిపోయిన రాచకీలం ప్రభుత్వ పాఠశాల పైకప్పు రేకులు
అనంతగిరి, మే 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలలు బీభత్సం సృష్టించాయి. పినకోట పంచాయతీ రాచకీలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. వర్షానికి పాఠశాల లోపల సామగ్రి తడిసిపోయింది. అలాగే భీసుపురం, అనంతగిరి, డముకు, తదితర గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
అరకులోయలో...
అరకులోయ: మండలంలో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడింది. దీంతో జనం ఊరట చెందారు.