Share News

మెడికల్‌ కాలేజీ పనులు సకాలంలో పూర్తికి చర్యలు

ABN , Publish Date - May 05 , 2026 | 12:39 AM

స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదే శించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మెడికల్‌ కాలేజీ పనులపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మెడికల్‌ కాలేజీ పనులు సకాలంలో పూర్తికి చర్యలు
అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ నిషాంతి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

- అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, మే 4(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదే శించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మెడికల్‌ కాలేజీ పనులపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాలేజీలోని ప్రధాన భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పూర్తయిన భవనాల్లోని ఫర్నిచర్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి, వినియోగంలోకి తీసుకుని రావాలన్నారు. మొత్తం నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడకుండా పటిష్టంగా నిర్మించాలన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనలు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, ఏడీహెచ్‌వో టి.ప్రతాప్‌, ఏపీ ఎంహెచ్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అచ్చెంనాయుడు, డీఈఈ విజయభాస్కర్‌, ఎన్‌సీసీ ప్రతినిధి మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:39 AM