మందుల కొరత లేకుండా చూడాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:47 AM
ఎన్టీఆర్ వైద్యాలయంలో అత్యవసర మందులు అందుబాటులో లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుంచి కొనుగోలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వైద్యాలయం సమావేశ మందిరంలో శనివారం వైద్యాలయం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
- అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుంచి కొనుగోలు చేయాలి
- ఎన్టీఆర్ వైద్యాలయం అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి టౌన్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్యాలయంలో అత్యవసర మందులు అందుబాటులో లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుంచి కొనుగోలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వైద్యాలయం సమావేశ మందిరంలో శనివారం వైద్యాలయం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణ, మందుల లభ్యత, సిబ్బంది కొరత, వైద్యాలయం ఆధునీకరణ, తదితర అంశాలపై సమీక్ష చేశారు. వైద్యాలయం అభివృద్ధికి అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని, రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్‌లు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో అంబులెన్స్‌కు డ్రైవర్‌ను భర్తీ చేసేందుకు నిర్ణయించారన్నారు. ప్రస్తుతం వైద్యాలయానికి వస్తున్న ఓపీ, సర్జరీలు, గైనిక్ ప్రసవాలపై చర్చించారన్నారు. ఒక అధునాతనమైన ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్చించినట్టు చెప్పారు. గైనిక్ వార్డు వైపు ఉన్న లిఫ్ట్ మాదిరిగానే వైద్యాలయం ముందు భాగంలోని ఓపీ విభాగం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారన్నారు. అలాగే వైద్యాలయంలో రోగులకు ఉన్న ప్రత్యేక గదుల్లో ఏసీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకొని చార్జీలు వసూలు చేయాలని చెప్పారన్నారు. సిటీ స్కాన్ చేసిన రోగులకు ఫిలిం ఇవ్వలేకపోతున్నందున కలిగే ఇబ్బందులను చర్చించి అందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. కొవిడ్ ప్రభావం రాష్ట్రంలోనూ ప్రారంభమైనందున ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి ఎవరూ కోవిడ్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు వారు తెలిపారు. ఇప్పటికే వైద్యాలయంలోని అత్యవసర విభాగం వార్డులో పడకలు సిద్ధం చేశామని, అయితే జిల్లాలో ఎటువంటి కేసులు లేవని, ఒక వేళ వస్తే ఆ బెడ్స్‌ను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వైద్యాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు, డాక్టర్ డీడీ నాయుడు, తాడి శాంతికుమారి, వైద్యాధికారులు పాల్గొన్నారు.