గంజాయి జోలికి పోవద్దు
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:29 PM
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గంజాయి రవాణాకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గిరిజనులకు ఎస్పీ అమిత్‌బర్దార్ సూచించారు.
జీవితాలను నాశనం చేసుకోవద్దు
గిరిజనులకు ఎస్పీ అమిత్‌బర్దార్ సూచన
హుకుంపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గంజాయి రవాణాకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గిరిజనులకు ఎస్పీ అమిత్‌బర్దార్ సూచించారు. మంగళవారం మండలంలోని బారపల్లి, జీకేమండ గ్రామాల గిరిజనులకు స్థానిక సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తే జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గంజాయికి స్వస్తి పలికి ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని చెప్పారు. అలాగే బాల్య వివాహాలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ దుర్గాప్రసాద్, పోలీస్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.