గాజువాకలో అత్యాధునిక క్రీడా సముదాయం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:40 AM
క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
రూ.9.5 కోట్లతో నిర్మాణానికి ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన
గాజువాక, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):
క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. గాజువాక ఆదర్శ మైదానంలో రూ.9.5 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక క్రీడా సముదాయానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో గల క్రీడాకారుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గాజువాక నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకువెళుతోందన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ఎంతో కృషి చేశామన్నారు. భవిష్యత్తులో మరింత చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్‌పర్సన్ కోన తాతారావు, టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, నాయకులు నల్లూరు సూర్యనారాయణ, దల్లి గోవిందరెడ్డి, దీనంకొండ కృష్ణంరాజు, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాస్, రాజాన రామారావు, అడుసుమల్లి దీప్తి, రౌతు గోవిందరావు పాల్గొన్నారు.