‘అరకు ఫైనరీ’కి రాష్ట్ర స్థాయి స్వచ్చ టూరిజం అవార్డు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:39 PM
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర భాగంగా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ టూరిజం అవార్డుకు డుంబ్రిగుడ మండలంలోని అరకు ఫైనరీ ఎంపికైన సంగతి పాఠకులకు తెలిసిందే.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు
అందుకున్న డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, డీటీవో చలపతిరావు
పాడేరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర భాగంగా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ టూరిజం అవార్డుకు డుంబ్రిగుడ మండలంలోని అరకు ఫైనరీ ఎంపికైన సంగతి పాఠకులకు తెలిసిందే. దీంతో గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో పాడేరు డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, జిల్లా టూరిజం అధికారి పి.చలపతిరావులకు సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ టూరిజం అవార్డును స్వీకరించారు. అరకు ఫైనరీకి రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కడంపై జిల్లా అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.