ఎస్‌టీ ఓటర్లు 4,69,033
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:40 PM
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అల్లూరి జిల్లాలో పంచాయతీల వారీగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల జాబితాలను మంగళవారం ప్రదర్శించారు.
ఎస్‌సీలు: 2,878
బీసీలు: 21,168
ఇతర కులాలు: 5,388
పురుషులు: 2,41,447
మహిళలు: 2,56,997
ఇతరులు: 23
పంచాయతీల్లో ఎస్‌సీ, ఎస్‌టీ,
బీసీల ఓటరు జాబితాల ప్రదర్శన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అల్లూరి జిల్లాలో పంచాయతీల వారీగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల జాబితాలను మంగళవారం ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,98,467 మంది ఓటర్లుండగా.. అందులో ఎస్‌టీ ఓటర్లు 4,69,033 మంది ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 2,446 పోలింగ్ కేంద్రాలున్నాయి. పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది మొత్తం 4,98,467 మంది ఓటర్లున్నారని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్ తెలిపారు. ఇందులో ఎస్‌టీలు 4,69,033 మంది, ఎస్‌సీలు 2,878 మంది, బీసీలు 21,168 మంది ఉన్నారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా.. అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. వర్గీకరించిన ఓటరు జాబితాల ప్రదర్శన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించడంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల తుది జాబితా, కేటగిరీ వారీగా ఓటర్ల తుది జాబితాలను అధికారులు ప్రకటించడంతో ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. రాజకీయ పార్టీలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారిస్తున్నాయి.
జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఇతర కులాల ఓట్ల వివరాలు
--------------------------------------------------------------------------------
వ.సం. మండలం పంచాయతీలు ఎస్‌సీ ఎస్‌టీ బీసీ ఇతరులు మొత్తం ఓటర్లు
1. అరకులోయ 14 190 39,794 1,454 1,287 42,725
2. జి.మాడుగుల 17 3 43,699 964 8 44,647
3. కొయ్యూరు 33 558 36,255 5,487 1,411 43,711
4. ముంచంగిపుట్టు 23 32 38,335 481 47 38,895
5. హుకుంపేట 33 35 45,134 594 24 45,787
6. చింతపల్లి 17 500 60,626 3,892 356 65,374
7. డుంబ్రిగుడ 18 70 37,849 383 441 38,743
8. పెదబయలు 23 12 42,996 284 32 43,324
9. పాడేరు 26 260 38,869 4,421 977 44,536
10. అనంతగిరి 24 756 36,126 1,125 279 38,286
11. జీకేవీధి 16 453 49,350 2,083 526 52,412
--------------------------------------------------------------------------------
మొత్తం 244 2,878 4,69,033 21,168 5,388 4,98,467
--------------------------------------------------------------------------------