Share News

జేసీగా శ్రీపూజ..

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:30 PM

ఇటీవల జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా స్థానిక జాయింట్‌ కలెక్టర్‌గా నియమించిన టి.శ్రీపూజ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

జేసీగా శ్రీపూజ..

ఐటీడీఏ పీవోగా ఆధిత్యవర్మ

నేడు ఇద్దరు యువ ఐఏఎస్‌లు బాధ్యతల స్వీకరణ

పాడేరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా స్థానిక జాయింట్‌ కలెక్టర్‌గా నియమించిన టి.శ్రీపూజ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న ఆమెను జాయింట్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే గత కొన్నాళ్లుగా స్థానిక జేసీ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆమె ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో ఆమెనే శాశ్వత జేసీగా నియమించడంతో శనివారం బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే మేఘాలయలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీపూజ భర్త ఆధిత్యవర్మను ఏపీ రప్పించి, స్థానిక ఐటీడీఏ పీవోగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన శనివారం శ్రీపూజ నుంచి ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Updated Date - Apr 10 , 2026 | 11:30 PM