జేసీగా శ్రీపూజ నియామకం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:46 PM
ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న తిరుమాని శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐటీడీఏ పీవోగా ఆమె భర్త ఆదిత్యవర్మను నియమించిన ప్రభుత్వం
పాడేరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న తిరుమాని శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆమె భర్త ఆదిత్యవర్మను ఐటీడీఏ పీవోగా నియమించింది. గతేడాది సెప్టెంబరు 3న తిరుమాని శ్రీపూజను ఐటీడీఏ పీవోగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె సెప్టెంబరు 8న బాధ్యతలు స్వీకరించారు. కాగా తన బ్యాచ్‌కు చెందిన మేఘాలయాలో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదిత్యవర్మతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు వివాహమైంది. ఈ నేపథ్యంలో అస్సాం క్యాడర్‌కు చెందిన ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ గత నెలలోనే ఉత్తర్వులు వెలుబడ్డాయి. దంపతులిద్దర్నీ ఒకే ప్రాంతంలో నియమించాలనే ఆలోచనతో ఆదిత్యవర్మను ఐటీడీఏ పీవోగా, ఐటీడీఏ పీవోగా ఉన్న శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.