పాడేరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:25 PM
స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
పాడేరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పని చేసిన మెడి కల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి జనవరి 31న పదవీవిరమణ చేశారు. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ విభాగంలో హెచ్‌వోడీగా పని చేస్తున్న డాక్టర్ కె.శ్రీనివాసరావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. గిరిజన ప్రాంతంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తానని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.