ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:09 AM
ఖేల్ ఏఎస్‌ఆర్ పేరిట జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంగళ, బుధవారాలు క్రీడా పోటీలను నిర్వహిస్తామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
నేడు, రేపు పాడేరులో నిర్వహణ
పాడేరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఖేల్ ఏఎస్‌ఆర్ పేరిట జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంగళ, బుధవారాలు క్రీడా పోటీలను నిర్వహిస్తామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులందర్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్రీడా స్ఫూర్తి, ఆరోగ్య సంరక్షణ, స్నేహభావం పెంపొందించాలనే ఆలోచనతో తొలిసారిగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పురుషులకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, షటిల్, చెస్, బాస్కెట్ బాల్, పరుగుపందాలు, షాట్‌పుట్, మహిళలకు త్రోబాల్, మ్యూజికల్ చైర్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు 28 కమిటీలను ఏర్పాటు చేశామని, అందరి సమన్వయంలో రెండు రోజులు ఉత్సాహంగా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.