మన్యంలో స్పైసెస్ బోర్డు సభ్యుడి పర్యటన
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:18 PM
కేంద్ర సుగంధ ద్రవ్యాల సంస్థ సభ్యుడు కేవీ.సుబ్బారావు శుక్రవారం ఏజెన్సీలో పర్యటించారు.
పాడేరు, హుకుంపేట, అరకులోయ, డుంబ్రిగుడ
మండలాల్లో మిరియాల పంటలు పరిశీలన
పాడేరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సుగంధ ద్రవ్యాల సంస్థ సభ్యుడు కేవీ.సుబ్బారావు శుక్రవారం ఏజెన్సీలో పర్యటించారు. ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత జిల్లా కలెక్టర్ టి.నిషాంతిని కలిశారు. అనంతరం ఆయన స్పైసెస్ బోర్డు అధికారులతో కలిసి పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లోని పలు గ్రామాల్లో కాఫీ తోటలు, మిరియాల పాదులను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో గిరిజన రైతులతో ఆయన మాట్లాడారు. పంట దిగుబడులు కాఫీ బోర్డు, స్పైసెస్ బోర్డు ద్వారా రైతులకు అందుతున్న పరికరాలు, రాయితీలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్సైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బి.కల్యాణి, కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో రమేశ్, తదితరులు పాల్గొన్నారు.