Share News

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:15 AM

పేదల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ హౌసింగ్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి రానున్న మూడు, నాలుగు నెలలు అనువైన వాతావరణం ఉంటుందన్నారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

పనుల్లో వెనుకబడిన వారికి తాఖీదులు

హౌసింగ్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

పేదల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ హౌసింగ్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి రానున్న మూడు, నాలుగు నెలలు అనువైన వాతావరణం ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వెనుకబడిన కాంట్రాక్టర్లు అదనంగా కూలీలను నియమించుకోవాలన్నారు. నిర్మాణ పనులు పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తానని, లక్ష్యాలను సాధించలేని అధికారులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. గృహ నిర్మాణ పనుల్లో వెనుకబడిన వారికి తాఖీదులు ఇవ్వాలని హౌసింగ్‌ పీడీ సత్తిబాబును ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలతోపాటు మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు తమ పరిధిలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ పీడీ సత్తిబాబు, భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 01:15 AM