Share News

శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:34 AM

తిరుపతి, బెంగళూరు, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా నడవనున్నాయి. విశాఖ-తిరుపతి-విశాఖ (18505/18506) ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి, విశాఖ-చర్లపల్లి-విశాఖ (18527/18528) సర్వీసులు ఏప్రిల్‌ 3 నుంచి, విశాఖ-బెంగళూరు-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (18509/18510) ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక రైళ్లు

వారానికొకమారు నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్‌

1 నుంచి తిరుపతి,

3 నుంచి చర్లపల్లి, 5 నుంచి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లు

విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

తిరుపతి, బెంగళూరు, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా నడవనున్నాయి. విశాఖ-తిరుపతి-విశాఖ (18505/18506) ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి, విశాఖ-చర్లపల్లి-విశాఖ (18527/18528) సర్వీసులు ఏప్రిల్‌ 3 నుంచి, విశాఖ-బెంగళూరు-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (18509/18510) ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

విశాఖ-తిరుపతి (18505) రైలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరి 7.35 గంటలకు మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్‌ 2 నుంచి ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతి (18506)లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటకు విశాఖ చేరుతుంది.

విశాఖ-బెంగళూరు (18509) రైలు ఏప్రిల్‌ 5 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్‌ 6 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు (18510)లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది.

విశాఖ-చర్లపల్లి (18527) రైలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (18528) ఏప్రిల్‌ 4 నుంచి ప్రతి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు విశాఖ చేరుతుంది.

మళ్లింపు మార్గంలో గరీబ్‌రఽథ్‌

విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ రైల్వే యార్డులో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నడుస్తున్న గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు (12739/12740) ఏప్రిల్‌ 17 నుంచి మే 31 వరకు రాయనపాడు, విజయవాడ నార్త్‌, గుణదల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఇరువైపులా విజయవాడ స్టేషన్‌లో తాత్కాలికంగా హాల్ట్‌ ఉండదని రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - Mar 25 , 2026 | 01:34 AM