పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:59 AM
జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో రెండో రోజు సదస్సుకు కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు.
కలెక్టర్ విజయకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు సూచన
అనకాపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో రెండో రోజు సదస్సుకు కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన బొజ్జన్న కొండ, కొండకర్ల ఆవ, సముద్ర తీర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను నివేదిక రూపంలో సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలను మరింత వేగంతం చేయాలని సూచించారు. చివరి రోజు సదస్సుకు ఎస్పీ తుహిన్ సిన్హా కూడా హాజరయ్యారు.