సమస్యల సత్వర పరిష్కారానికే ప్రత్యేక పీజీఆర్‌ఎస్
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:18 PM
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ఒక నెల.. ఒక నియోజకవర్గం కార్యక్రమంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ నిషాంతి
అరకులోయలో జరిగిన ఒక నెల.. ఒక నియోజకవర్గంలో 91 ఫిర్యాదులు స్వీకరణ
అరకులోయ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ఒక నెల.. ఒక నియోజకవర్గం కార్యక్రమంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. శనివారం అరకులోయ ఎంపీడీవో సమావేశమందిరంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు 91 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోయ నియోజకవర్గంలో వారానికి ఒక మండలంలో జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ పీజీఆర్‌ఎస్‌ల్లో సమస్యలను నివేదించి సత్వర పరిష్కారం పొందాలన్నారు. ఈ పీజీఆర్‌ఎస్‌లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు 20 అర్జీలు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖకు 13, జిల్లా సర్వే, భూరికార్డుల శాఖకు 13 అర్జీలు వచ్చాయన్నారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, గిరిజన విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్‌డీఏ, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి నీలకంఠరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఇన్‌చార్జి డీఈవో పీబీకే పరిమళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి ఝాన్సీబాయి, డీపీవో కేపీ శేఖర్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, సమగ్ర శిక్ష ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ స్వామినాయుడు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి ఆర్వీ.రమణారావు, పీఆర్ ఈఈ కొండయ్యపడాల్, టీడబ్ల్యూ డీఈఈ అభిషేక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీ.నాగేశ్వరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డి.ప్రతాప్‌కుమార్, ఎంపీడీవో వీసం ప్రసాద్, తహశీల్దార్ రాజా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.