Share News

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:11 AM

జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చేపడుతున్నామని ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ తెలిపారు. జిల్లాకు కేటాయించిన మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
పాడేరులో మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న ఎస్‌పీ అమిత్‌బర్దార్‌

ఎస్‌పీ అమిత్‌బర్దార్‌

పాడేరులో మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభం

పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చేపడుతున్నామని ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ తెలిపారు. జిల్లాకు కేటాయించిన మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగానే మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను జిల్లాకు కేటాయించారన్నారు. ఎటువంటి నేరాలు జరిగినా తక్షణమే సంఘటనా స్థలానికి మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ చేరుకుని కేసుకు అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలు శాస్త్రీయంగా సేకరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ మొబైల్‌ వ్యాన్‌లో అత్యాధునిక సదుపాయాలు, పరికరాలున్నాయని, నేరాలకు సంబంఽధించిన సంపూర్ణమైన ఆధారాలను సేకరించేందుకు నివుణుల బృందం అందుబాటులో ఉంటుందన్నారు. గతంలో నేరాలు జరిగిన ప్రదేశాలను ఫోరెన్సిక్‌ బృందం సందర్శించి, అక్కడ ఆఽధారాలను సేకరించి, వాటిని ల్యాబ్‌కు పంపే పరిస్థితి ఉండేదని, కానీ ఇక అటువంటి సమస్య లేకుండా నేరం జరిగిన ప్రదేశానికే మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వెళ్లి ఆధారాలను సేకరించడం వల్ల నేరాలు చేసే వారిని శిక్షించేందుకు అవకాశం కలుగుతుందని ఎస్‌పీ పేర్కొన్నారు.

జిల్లాలో రెండు నెలల్లో నేరాలు తగ్గుముఖం

జిల్లాలో గత సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్‌పీ తెలిపారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు ప్రమాదాలు అధికం కాగా, మహిళలపై అఘాయిత్యాలు, తదితర నేరాలు మాత్రం 15 శాతం పైబడి తగ్గాయన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు సైతం తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పీ వై.శృతి, డీఎస్‌పీ వి.రాజసింహారెడ్డి, పాడేరు సీఐ రామారావు, అరకులోయ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ క్రాంతికుమార్‌, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:11 AM