నేడు, రేపు డిజిటలైజేషన్‌పై ప్రత్యేక శిబిరాలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:50 PM
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్లకు సీఈవో వివేక్ యాదవ్ ఆదేశం
పాడేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సర్ ప్రక్రియను ఈనెల 14వ తేదీ నాటికి పూర్తి చేసి 21న ముసాయిదా ఓటరు జాబితాల ప్రదర్శన నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయి అధికారులతో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటు చేసి, ఆయా ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈవో వివేక్ యాదవ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.