Share News

జనగణన ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - May 06 , 2026 | 12:51 AM

జిల్లాలో జనగణన ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ జనగణన ప్రక్రియలో చేర్చాలని, ఓటరు జాబితాల్లో చేర్పులు, మార్పులపై బూత్‌ స్థాయి అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,400 గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియలను ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు.

జనగణన ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న జేసీ టి.శ్రీపూజ

అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశం

- భూముల మ్యుటేషన్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచన

పాడేరు, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనగణన ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ జనగణన ప్రక్రియలో చేర్చాలని, ఓటరు జాబితాల్లో చేర్పులు, మార్పులపై బూత్‌ స్థాయి అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,400 గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియలను ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు. అన్ని మండలాల్లో జరిగిన రీసర్వే వివరాలను తొలుత సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపించి రికార్డుల పరిశీలన జరపాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎంల స్పందన ప్రక్రియలో నాణ్యత, సంతృప్తి శాతాన్ని పెంచాలన్నారు. ఎక్కడైనా ఐవీఆర్‌ఎస్‌లో సంతృప్తికర సేవలు అందని పరిస్థితులుంటే సంబంధిత తహశీల్దార్‌ ఫైల్‌తో కలెక్టరేట్‌కు హాజరు కావాలన్నారు. జిల్లాలో భూముల మ్యుటేషన్‌ ప్రక్రియ పక్కగా జరగాలని, ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదని ఆమె చెప్పారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం లేకుండా సకాలంలో జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన తహశీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:51 AM