Share News

జిల్లా ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:47 PM

జిల్లా ప్రగతికి ప్రతి శాఖాధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

జిల్లా ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు

అధికారులకు జిల్లా కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

కలెక్టర్ల సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్ష

పాడేరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రగతికి ప్రతి శాఖాధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. ఈనెల 10, 11 తేదీల్లో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్షించేందుకు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు పురోగతి సాధించని అంశాలను గుర్తించాలని, ఈక్రమంలో గుర్తించిన సమస్యలను అధిగమించాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఆశించిన పురోగతి సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్ధేశించిన సమయానికి ప్రగతి సాధించాలన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలోని అంశాలకు బాధ్యత వహిస్తూ, చేపట్టాల్సిన చర్యలపై పక్కాగా ముందుకు సాగాలన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టడడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడం ముఖ్యమన్నారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఆశించిన ప్రగతి సాధించాలని కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్‌, డీఈవో భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, రైతు సాధికారత సంస్థ డీపీఎం ఎల్‌.భాస్కరరావు, జిల్లా మత్స్యశాఖాధికారి శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి వి.రమణారావు, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, జిల్లా టూరిజం ఆఫీసర్‌ పి.చలపతిరావు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ రాధామాధవి, సీపీవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:47 PM