బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:51 AM
అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో 30, 31 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మంగళవారం పరిశీలించారు.
పరవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో 30, 31 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మంగళవారం పరిశీలించారు. ప్రధాన వేదిక, ఫుడ్‌స్టాల్స్, హస్తకళల ప్రదర్శన ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అధికారులకు సూచించారు. బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలు, స్కూబా డైవింగ్, ఉప్పుటేరులో బోటు షికారు, పడవల పోటీలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బీచ్ ఫెస్టివల్ ఉంటుందన్నారు. ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చి బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట సర్పంచ్ చింతకాయల సుజాత, కూటమి నాయకులు పైలా జగన్నాథరావు, మాసవరపు అప్పలనాయుడు, చింతకాయల ముత్యాలు, వియ్యపు చిన్న, కన్నూరు వెంకటరమణ, బొద్దపు శ్రీనివాసకాసులు, మోటూరు సన్యాసినాయుడు, బుగిడి రామగోవిందరావు, తదితరులు వున్నారు.