Share News

సమస్యలపై చట్టసభల్లో మాట్లాడండి

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:29 PM

గిరిజనుల సమస్యలపై తాము నిర్వహించే సభల్లో కాకుండా చట్టసభల్లో ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు నిలదీశారు.

సమస్యలపై చట్టసభల్లో మాట్లాడండి
మాట్లాడుతున్న అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీసిన అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు

పాడేరు, జూలై 17(ఆంధ్రజ్యోతి):

గిరిజనుల సమస్యలపై తాము నిర్వహించే సభల్లో కాకుండా చట్టసభల్లో ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు నిలదీశారు. జీవో నంబరు3, 1/70 చట్టంపై శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. జీవో నంబరు 3 రద్దు, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చట్టసభల్లో మాట్లాడకుండా, స్థానిక సభల్లోనే పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో మాట్లాడతారని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. జీవో 3 రద్దు సమయం(2020)లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం అన్యాయమన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:29 PM