Share News

ముఖ హాజరు కోసం పాట్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:37 AM

మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్‌ నెట్‌వర్క్‌ పని చేయకపోవడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫేస్‌ రికగ్నైషన్‌ సిస్టం)లో నమోదు చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మంగళవారం లోతుగెడ్డ పంచాయతీ చోడ్రాయి గ్రామానికి చెందిన గిరిజనులు సెల్‌ నెట్‌వర్కులేకపోవడం వల్ల లోతుగెడ్డ గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసుకున్నారు.

ముఖ హాజరు కోసం పాట్లు
విలేకరులతో మాట్లాడుతున్న చోడ్రాయి ఉపాధి కూలీలు

- సెల్‌ నెట్‌వర్క్‌ పనిచేయక రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఉపాధి కూలీల ఆవేదన

చింతపల్లి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్‌ నెట్‌వర్క్‌ పని చేయకపోవడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫేస్‌ రికగ్నైషన్‌ సిస్టం)లో నమోదు చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మంగళవారం లోతుగెడ్డ పంచాయతీ చోడ్రాయి గ్రామానికి చెందిన గిరిజనులు సెల్‌ నెట్‌వర్కులేకపోవడం వల్ల లోతుగెడ్డ గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ ప్రతి రోజు ఉపాధి పనులకు వెళుతున్న తాము రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతుగెడ్డకు వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేసుకోవాల్సి వస్తుందన్నారు. దీంతో ప్రయాణ భారంతో పాటు సమయం వృఽథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేని గ్రామాల ఉపాధి కూలీలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి మినహాయింపు కల్పించాలని మాజీ సర్పంచ్‌ చింతర్ల సునీల్‌, గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:37 AM