Share News

కేజీవీబీల్లో కాస్త మెరుగు

ABN , Publish Date - May 01 , 2026 | 12:22 AM

జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో వివిధ యాజమాన్యాలతో పోల్చితే కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఫలితాలు కాస్త మెరుగ్గా వచ్చాయి.

కేజీవీబీల్లో కాస్త మెరుగు
జిల్లాలో ఓ కేజీబీవీలో ప్రత్యేక తరగతుల నిర్వహణ(ఫైల్‌)

పర్వాలేదనిపించుకున్న గురుకులాలు

ఘోరంగా దిగజారిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

పాడేరు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫలితాలు మాత్రం ఘోరంగా దిగజారాయి. వాస్తవానికి కేజీబీవీల్లో కంటే ప్రభుత్వ/జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోనే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించాలి. కాని పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. గిరిజన సంక్షేమ గురుకులాలు ఎప్పటిలాగానే తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. జిల్లాలోని కేజీబీవీల్లో 61.06 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 25.49 శాతంతో అట్టడుగు స్థానానికి చేరింది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 60.89 శాతం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 42.97 శాతం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 41.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే కేజీబీవీల్లో, గిరిజన సంక్షేమ గురుకులాల్లో మినహా మిగిలిన విద్యాలయాల్లో వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక ఆశించిన ఫలితం ఇవ్వలేదని తెలుస్తున్నది. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాలను గుణపాఠంగా భావించి వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.

Updated Date - May 01 , 2026 | 12:22 AM