Share News

ఉపాధి పనుల ముసుగులో మట్టి దందా

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:05 AM

మండలంలోని చీమలాపల్లి గ్రామ శివారులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీబీ జీరాంజీ ఉపాధి పనులను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు దర్జాగా ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది.

ఉపాధి పనుల ముసుగులో మట్టి దందా
చీమలాపల్లిలో ఉపాధి శ్రామికులు చెరువు తవ్వుతున్న పక్కనే ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి తరలిస్తున్న దృశ్యం

- దర్జాగా ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి తరలించేస్తున్న అక్రమార్కులు

- ఒక్కో ట్రాక్టర్‌ మట్టి రూ.1,500కు విక్రయం

- పట్టించుకోని అధికారులు

అచ్యుతాపురం రూరల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్యజ్యోతి): మండలంలోని చీమలాపల్లి గ్రామ శివారులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీబీ జీరాంజీ ఉపాధి పనులను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు దర్జాగా ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది.

మండలంలోని చీమలాపల్లి గ్రామ శివారులో వీబీ జీరాంజీ పథకం కింద చెరువు తవ్వకం పనులు జరుగుతున్నాయి. అయితే ఉపాధి హామీ శ్రామికులు తవ్వకాలు చేపడుతున్న సమీపంలోనే కొందరు అక్రమార్కులు ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌ మట్టిని రూ.1,500కు విక్రయిస్తున్నారు. ఈ చెరువు పనులు పూర్తయ్యేలోగా అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 01:05 AM