Share News

ఏపీఐఐసీ భూముల్లో మట్టి దోపిడీ

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:19 AM

రాజకీయంగా వారు శత్రువులు. కానీ అక్రమాల్లో మాత్రం మిత్రులు. మండలంలోని రామన్నపాలెంలో కొంతమంది తెలుగుదేశం, వైసీపీ నాయకులు ఇక్కడి ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. రవాణా చార్జీలతో కలిప ఒక్కో లోడుకు రూ.600-800 వరకు వసూలు చేస్తున్నారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం వద్ద వున్న ఏపీఐఐసీ భూముల్లో గత పది రోజులుగా మట్టి దోపిడీ సాగుతున్నది.

ఏపీఐఐసీ భూముల్లో మట్టి దోపిడీ
రామన్నపాలెంలోని ఏపీఐఐసీ భూమిలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన గోతులు

రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు

ట్రాక్టర్లతో చుట్టుపక్కల గ్రామాలకు తరలింపు

లోడు మట్టి రూ.600-800కు విక్రయం

అధికార, విపక్ష నేతలు కలిసి దందా

చోద్యం చూస్తున్న అధికారులు

మాకవరపాలెం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాజకీయంగా వారు శత్రువులు. కానీ అక్రమాల్లో మాత్రం మిత్రులు. మండలంలోని రామన్నపాలెంలో కొంతమంది తెలుగుదేశం, వైసీపీ నాయకులు ఇక్కడి ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. రవాణా చార్జీలతో కలిప ఒక్కో లోడుకు రూ.600-800 వరకు వసూలు చేస్తున్నారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం వద్ద వున్న ఏపీఐఐసీ భూముల్లో గత పది రోజులుగా మట్టి దోపిడీ సాగుతున్నది. చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్ల నిర్మాణాల్లో పునాదులు కప్పడానికి, ఖాళీ స్థలాలను ఎత్తుచేయడానికి, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రామన్నపాలెం రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రైవేటు స్ధలంలో సుమారు 600 ట్రాక్టర్‌ లోడుల మట్టిని డంప్‌ చేశారు. నిత్యం ఇటుగా రాకపోకలు సాగించే ఏపీఐఐసీ, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులలు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఏపీఐఐసీ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాల కారణంగా అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇదే భూమిలో గతంలో కొంతమంది మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ ఈసారి భారీ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇలాగే చోద్యం చూస్తుంటే.. ఏపీఐఐసీ భూములు చెరువులుగా మారతాయని ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:19 AM